పశువుల్లో ఎమ్మెల్యేల ముఖాలు కనిపిస్తున్నాయి..!!
Published on: Fri Aug 10, 2018 2:58PM
కమెడియన్ పృధ్వీ వైసీపీకి మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.. తాజాగా గుంటూరులో జరిగిన ‘వంచనపై గర్జన’ దీక్షలో పాల్గొన్న ఆయన చంద్రబాబు మీద, టీడీపీ మీద తీవ్ర విమర్శలు చేసారు.. మాట్లాడితే తనకు 40 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉందని చెప్పుకునే చంద్రబాబు, 40 ఏళ్ల జగన్ ను చూసి ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు.

తనని, పోసానిని, కృష్ణుడిని కుక్కలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.. కుక్కలంటే విశ్వాసంగా ఉంటాయిరా బచ్చాల్లారా.. వైసీపీకి కాపలా కుక్కలాగా ఉంటాం అని ఘాటుగా స్పందించారు.. ఏపీలో ప్రత్యేక హోదా అంశం నిలబడటానికి వైసీపీనే కారణమని అన్నారు.. తనకు ఎక్కడ పశువులు కనిపించినా వాటిల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేల ముఖాలే కనిపిస్తున్నాయని తీవ్ర వ్యాఖ్యలు చేసారు.. అలానే వైసీపీ ఎమ్మెల్యే టికెట్ ఆశించి ప్రచారం చేస్తున్నారని వచ్చిన వ్యాఖ్యలపై స్పందించిన ఆయన.. ఎమ్మెల్యే కాదు కదా కనీసం జెడ్పీటీసీ, ఎంపీటీసీ టికెట్‌ను కూడా ఆశించడం లేదని స్పష్టం చేసారు.. నన్ను జెండా మోసే సామన్య కార్యకర్తగా మాత్రమే చూడండి.. జగన్‌ని సీఎంగా చూడాలనేది నా కోరిక అని పృధ్వీ అన్నారు.


