TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

‘అష్టా చెమ్మా’ కలిసి రాలేదు: స్వాతి

Published on: Sat Mar 16, 2013 3:00PM

 

కలర్స్ స్వాతి పేరు వినగానే గలగలా మాట్లాడేసే ఒక చిలిపి అమ్మాయి మన కళ్ళ ముందు కదలాడుతుంది. ఆమె తెలుగు సినిమాలో ‘అష్టా చెమ్మా’ ఆట మొదలుపెట్టి చాలా కాలం అయినప్పటికీ ఇంతవరకు పట్టుమని పది సినిమాలు కూడా ఆమె చేయలేదు. ‘చేయలేదు అనే కంటే సినిమా ఆఫర్లు దొరకట్లేదు అని చెపితే ఇంకా బాగుంటుందని’ ఆమె నిర్మొహమాటంగా అంది.

 

“అసలు అష్టా చెమ్మా సినిమా విజయవంతం అయిన తరువాత నాకు చాలా సినిమా ఆఫర్లు వచ్చిపడిపోతాయని అనుకొన్నాను. అందరూ చాలా బాగా చేస్తున్నావని మెచ్చుకొనేవారే కానీ, ఎవరూ కూడా సినిమా ఆఫర్ ఇచ్చిన పాపాన్న పోలేదు. దానికి తోడూ ఓ నంది అవార్డు కూడా అందుకోవడంతో దర్శక నిర్మాతల దృష్టిలో నేనొక ప్రత్యేక నటిగా మిగిలిపోయి మామూలు పాత్రలకు ఆనకుండా పోయాను. అందువల్లే అడపా దడపా తమిళ్ సినిమాల వైపు కూడా వెళ్లి రావలసి వస్తోంది. అలాగని అక్కడికి వెళ్లి నేనేమి వేలు, లక్షలు సంపాదించేయట్లేదు. ఇప్పటికీ, నేను నా ఖర్చులకి అప్పుడప్పుడు మా డాడీ దగ్గర డబ్బులు అడగక తప్పట్లేదంటే నా పరిస్థితి అర్ధం అవుతుంది. త్వరలో విడుదల కానున్న ‘స్వామీ రారా’ హిట్టయితే కొత్త సినిమాలేమయినా దొరుకుతాయేమో చూడాలి మరి” అంటోంది కలర్స్ స్వాతి.