TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రంగురాళ్ళకి ఇంకా ఎంతమంది బలి కావాలి?

Published on: Thu Apr 26, 2012 10:39AM

విశాఖ జిల్లాలో రంగురాళ్ళు తవ్వకానికి వెళ్ళిన అనేకమంది మరణించారు. తాజాగా జి.కె.వీథి మండలం నల్లబెల్లి గ్రామ సమీపాన కొంతమంది అక్రమంగా రంగురాళ్ళు తవ్వుతుండగా మట్టిపెళ్ళలు విరిగి మరో ముగ్గురు మరణించారు. గత ఐదేళ్ళుగా ప్రతీఏటా కూలీలు మరణిస్తున్నప్పటికీ ప్రభుత్వం ఏమీ చూడనట్లు వ్యవహరిస్తోంది. నిజానికి రాష్ట్రప్రభుత్వం రంగురాళ్ళ త్రావ్వకాన్ని చాలా కాలం క్రితమే నిషేధించింది.

 

 

 

 

అయితే ఎక్కడా ఈ నిషేధం అమలు కావటం లేదు.గుజరాత్, రాజస్థాన్ నుంచి వస్తున్నా వ్యాపారులు, స్థానికంగా ఉన్న వ్యక్తులు, అధికారుల సహకారంతో ఈ అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. నిత్యం ఈ తంతు జరుగుతున్నప్పటికీ దీన్ని అరికట్టాల్సిన అటవీశాఖ, భూగర్భగనులశాఖ, రెవెన్యూశాఖలు లంచాల మత్తులోపడి త్రవ్వకాలను చూసీచూడనట్లు పోతున్నాయి. రంగురాళ్ళ త్రవ్వకాల్లో కూలీల బతుకులు బుగ్గిపాలవుతున్నాయి. వ్యాపారస్థులు మాత్రం అజ్ఞాతంగా ఉంటూ కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారు. కూలీలు మరణించిన వెంటనే వ్యాపారులు జిల్లా నుంచి పరారైపోతున్నారు. ముందు ఈ వ్యాపారులను అరెస్టు చేస్తే అక్రమత్రవ్వకాలు ఆగిపోతాయని స్థానికులు అంటున్నారు