TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విమానం కూలి 10 మంది మృతి

Published on: Mon Sep 8, 2014 10:14AM

 

కొలంబియాకి చెందిన ఒక చిన్న విమానం అమెజాన్ అటవీ ప్రాంతలో కుప్పకూలడంతో 10 మంది మరణించారు. చనిపోయినవారిలో ఎనిమిది మంది ప్రయాణికులు, ఇద్దరు సిబ్బంది. అరారకురా నుంచి ఫ్లోరెన్సియాకి ఈ విమానం వెళ్తూ వుండగా ప్రమాదం సంభవించింది. విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోయింది. ప్రమాద స్థలానికి సహాయక చర్యల బృందం చేరుకుంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా వెల్లడి కావాల్సి వుంది.