TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వార్తలలో ఎలాంటి వాస్తవం లేదు : ఆనం

Published on: Sat Dec 17, 2011 7:54AM

హైదరాబాద్: కలెక్టర్ల సమావేశంలో మంత్రులను బయటకు పంపలేదని మంత్రుల సమక్షంలోనే సమావేశం జరిగిందని ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి  అన్నారు. బయటకు పంపారన్న వార్తలలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. మంత్రులకు, సిఎంకు మధ్య అగాధం లేదన్నారు. పార్టీ విప్ ధిక్కరించిన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప ఎంపీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్గం ఎమ్మెల్యేలపై వేటు ఖాయమన్నారు.ముఖ్యమంత్రి కిరణ్ నిర్ణయం మేరకే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్నారు. శాఖల మార్పు మంత్రుల సమష్టి నిర్ణయంతోనే జరుగుతుందన్నారు. జూలై లోపే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. పంచాయతీ ఎన్నికల అంశం కోర్టులో ఉన్నందున ఆలస్యమయ్యే అవకాశముందన్నారు. బడ్జెట్ సమావేశాలలోపు మున్సిపల్ ఎన్నికలు నిర్వహించనున్నామన్నారు.