TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గజగజలాడుతున్న ఉత్తర భారతం!

Published on: Thu Jan 9, 2025 2:43PM

ఉత్తర భారతం చలికి గజగజలాడుతోంది. తీవ్రమైన చలిగాలులకు తోడు పొగమంచుతో జనం నానా ఇబ్బందులూ పడుతున్నారు. దేశ రాజధాని నగరాన్ని మరో సారి కాలుష్యం కమ్మేసింది. ఢిల్లీలో గాలి నాణ్యత దారుణంగా  పడపోయింది.  

గురువారం హస్తినలో అత్యల్పంగా 6.4 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.  ఇక  ఉత్తరాది రాష్ట్రాల లోనూ చలి తీవ్రత అధికంగా ఉంది.  ఉత్తరప్రదేశ్‌ వ్యాప్తంగా పొగమంచు కమ్మేసింది. లక్నోలో గురువారం (జనవరి 9) అత్యల్పంగా 7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. అలాగే  ప్రయాగ్‌రాజ్‌లో 7.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.  

హర్యానా, అంబాలాలో ఈ నెల 14 వరకూ సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక జమ్మూ కాశ్మీర్ ను మంచు దుప్పటి కప్పేసిందా అన్నట్లుగా పరిస్థితి ఉంది. గురువారం (జనవరి (9) జమ్మూలో , 3.2, గుల్మార్గ్‌ లో 4.6, బనిహల్‌లో 4.8, కుప్వారాలో  3.6 డిగ్రీల  అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.