TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కాగ్నిజెంట్ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి లోకేశ్

Published on: Fri Dec 12, 2025 10:03AM

 

విశాఖలో కాగ్నిజెంట్ తాత్కాలిక కార్యాలయాన్ని మంత్రి లోకేశ్  ప్రారంభించారు. రుషికొండ ఐటీ పార్కులోని హిల్-2పై మహతి ఫిన్టిక్ భవనంలో కార్యాలయం ఏర్పాటైంది. వెయ్యి సీటింగ్‌ కెపాసిటీతో దీన్ని తీర్చిదిద్దారు. ఈ కార్యక్రమంలో ఎంపీ శ్రీభరత్‌, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

 కాగ్నిజెంట్‌ శాశ్వత క్యాంపస్‌ నిర్మాణానికి  ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ‘కాపులుప్పాడ ఐటీ హిల్స్‌లో 21.31 ఎకరాలను సంస్థకు కేటాయించాం. అందులో ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఐటీ, డిజిటల్‌ ట్రాన్స్‌ఫర్మేషన్‌ ఐటీ క్యాంపస్‌ను సంస్థ మూడు దశల్లో రూ.1,583 కోట్లతో నిర్మించనుంది. తద్వారా 8,000 మందికి ఉపాధి లభిస్తుంది.