TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

  హైదరాబాద్ లో  చంద్రబాబుపై ‘కోడ్’ కేసు

Published on: Thu Nov 2, 2023 1:34PM

రాజమండ్రి జైలు నుంచి  చంద్రబాబు విడుదల కావడంతో తెలుగు ప్రజలు సంబరాలు చేసుకుంటున్న మూడ్ లో ఉన్నప్పుడే ఆయనపై మరో కేసు నమోదైంది. ఈ సారి 
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన ఆరోపణపై కేసు నమోదు చేశారు.  హైదరాబాద్‌ బేగంపేట ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు, అభిమానులు, ఐటీ ఉద్యోగులు  చంద్రబాబుకు  గురువారం ఘనస్వాగతం లభించింది. ఎన్నికల కోడ్‌  ఉల్లంఘించినట్లు ర్యాలీ నిర్వాహకులపై బేగంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఎలాంటి అనుమతులు లేకుండా బేగంపేట ఎయిపోర్టు నుంచి జూబ్లిహిల్స్‌లోని చంద్రబాబు నివాసానికి ర్యాలీ తీశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. రెండుగంటలు రోడ్లపై న్యూసెన్స్ చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేశారని అందులో ఆరోపించారు. ర్యాలీ నిర్వహించిన హైదరాబాద్ సిటీ టీడీపీ జనరల్ సెక్రెటరీ జివిజి నాయుడు సహా పలువురిపై  పోలీసులు కేసు నమోదు చేశారు .