TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ హామీని నిర్ద్వంద్వంగా తిరస్కరించిన కాక్రోచ్ జనతా పార్టీ.!

Published on: Fri Jul 24, 2026 9:21AM

నీట్  పేపర్ లీకేజీ వ్యవహారం రోజురోజుకూ ముదురుతోంది. దీంతో ఎట్టకేలకు ఈ విషయంపై స్పందించిన ప్రధాని మోడీ.. పరీక్షల నిర్వహణ వ్యవస్థపై సర్వత్రా చెదిరిపోయిన నమ్మకాన్ని మళ్లీ పునరుద్ధరించేందుకు, లీకేజీ బాధ్యులపై  కఠిన చర్యలు తీసుకునేందుకు వీలుగా  ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని   ప్రకటించారు.   దోషులను కఠినంగా శిక్షిస్తామని మోదీ హామీ ఇచ్చారు. అయితే ప్రధాని హామీని, ప్రతిపాదనను కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు చేస్తున్న యువత నిర్ద్వంద్వంగా తిరస్కరించింది.  

 కాక్రోచ్ జనతా పార్టీ  ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన హామీని ఖండించడమే కాకుండా..  దేశ విద్యావ్యవస్థలో ఇంతటి భారీ అక్రమాలు జరిగినా బాధ్యత వహించకపోవడం సరికాదనీ, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలన్న తమ డిమాండ్ లో ఇసుమంతైనా మార్పు లేదనీ విస్పష్టంగా ప్రకటించింది.   విద్యార్థుల సమస్యలపై చర్చలు, ప్రభుత్వ అధికారిక భవనాలు లేదా ప్రదేశాల్లో కాకుండా, జంతర్ మంతర్ వేదికగా జరగాలని సీజేపీ స్పష్టం చేసింది. అలాగే శుక్రవారం (జులై 24) దేశవ్యాప్తంగా భారీ  ఆందోళనలకు పిలుపునిచ్చింది.   సీజేపీ పిలుపు నేపథ్యంలో  ఢిల్లీ వ్యాప్తంగా భద్రతా బలగాలు తీవ్ర అప్రమత్తమయ్యాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే.. కఠిన చర్యలు తప్పవని, అవసరమైతే పాస్‌పోర్టులను రద్దు చేస్తామనీ ప్రభుత్వం హెచ్చరించింది.   

అదలా ఉంటే ఆందోళన చేస్తున్న విద్యార్థులు చేస్తున్న ఆరోపణల నిజాయితీనే ప్రశ్నిస్తూ  బిజెపి ఎంపీ నిషికాంత్ దూబే చేసిన వ్యాఖ్యలు  రాజకీయ దుమారానికి తెరలేపాయి.  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తూ..  నీట్ లీకేజీపై ప్రధాని మోదీ విడుదల చేసిన వీడియో ప్రకటన  దయనీయంగా ఉందనీ, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రవెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

విద్యార్థుల ఉద్యమానికి అన్ని వర్గాల నుంచీ మద్దతు లభిస్తోంది. పలువురు సినీ సెలబ్రిటీలు విద్యార్థుల ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.  బాలీవుడ్ సూపర్‌స్టార్లు సల్మాన్ ఖాన్, అలియా భట్, గ్లో పాప్ ఐకాన్ దిల్జీత్ దొసాంజ్, దక్షిణాది దిగ్గజ నటులు కమల్ హాసన్, ఆర్. మాధవన్, విజయ్ సేతుపతి వంటి వారు విద్యార్థులకు బాసటగా గళమెత్తారు. 

NEET paper leak controversy, CJP protest NEET, PM Modi fast track courts