కోడి పందేలు.. పదికోట్లు పోగొట్టుకున్న తెలంగాణ మంత్రిగారు...


తెలుగు పండుగ సంక్రాంతి రోజు ఏపీలో జరిగే కోడి పందేలు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. పోలీసులు ఎంత భద్రత కట్టుదిట్టం చేసినా ఆంధ్రప్రదేశ్‌లో కోడి పందాలు ఆగలేదు. అధికారపార్టీ నాయకులు, ప్రతిపక్షనాయకులు కలసి పందాలను జోరుగా నిర్వహించారు. ఈ మూడు రోజుల్లో దాదాపు వెయ్యికోట్లకు పైగానే చేతులు మారాయంటే...ఈ పందాలు ఎంత జోరుగా జరిగాయో..అర్థం చేసుకోవచ్చు. కొంతమంది డబ్బులు పోగొట్టుకున్నారు..కొంతమంది సొమ్ము చేసుకున్నారు. ఇక కోడి పందేల్లో ఓ మంత్రిగారు ఏకంగా పదికోట్లే పోగొట్టుకున్నట్టు తెలుస్తోంది. ఇంతకీ ఆ మంత్రిగారు ఎవరనుకుంటున్నారా..? ఆశ్చర్యం ఏంటంటే.. అతను ఏపీ మంత్రి కాదు.. తెలంగాణ మంత్రిగారు. మొదటినుంచి తెలుగుదేశం పార్టీతో అనుబంధం కలిగిన ఈ మంత్రి ప్రతిసారీ కోడి పందాలకు ముందుగానే ఆంధ్రాకు వస్తుంటారట. ఈ సారి కూడా ఆయన ముందుగానే పోటీలకు వచ్చి భారీగా సొమ్ములను పందెంలో పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన దాదాపు రూ.15కోట్ల రూపాయలను పందాల్లో పెట్టారని వాటిలో దాదాపు రూ.10కోట్లు పోగొట్టుకున్నారని ఆయన సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే... సొమ్ముపోయినా..ఆ మంత్రిగారు మాత్రం.. నింపాదిగానే ఉన్నారట. పోతే పోయిందిలే...ఇంకా సంపాదించుకోవచ్చునన్న ధీమాతో ఉన్నారట. ఎంతైనా బంగారు తెలంగాణ కదా.. కెసిఆర్‌ మంత్రులకు పదికోట్లు సొమ్ము అంటే..చాలా చిన్నదై ఉండొచ్చు...