TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చిరు బిచ్చగాడు,పని తక్కువ..ప్రచారం ఎక్కువ: రోజా

Published on: Wed Jan 11, 2012 9:02AM

నిజామాబాద్: సిఎం కిరణ్ కుమార్ రెడ్డిది ప్రచారం ఎక్కువ పని తక్కువ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, సినీనటి రోజా విమర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరులో వైయస్ జగన్ 48 గంటల దీక్ష చేపట్టిన సందర్భంగా శిబిరం నుంచి ప్రజలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.  దున్నపోతు మీద వర్ష కురిస్తున్నట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆమె అన్నారు. పదవుల కోసం మొహం వాచిపోయిన  కాంగ్రెసు చిరంజీవి  అధిష్టానం వద్దకు బిచ్చగాడిలా తిరుగుతున్నాడని   తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని ఆమె  విమర్శించారు.  రైతులకు వైయస్ రాజశేఖర రెడ్డి అన్ని విధాలా సహాయంగా నిలిచారని ఆమె అన్నారు. జగన్ అధికారంలోకి వస్తే మళ్లీ వైయస్ పాలన వస్తుందని ప్రజలు ఆదరిస్తున్నారని ఆమె చెప్పారు. కాంగ్రెసులో ఎవరి గోల వారిదేనని ఆమె వ్యాఖ్యానించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉచితంగా విద్యుత్ ఇస్తామని, ఆ మాట నిలబెట్టుకున్న ఘనత ఒక్క వైఎస్సార్‌కే దక్కిందని ఆమె చెప్పుకొచ్చారు.కాగా తాను రైతులకు అండగా ఉంటానని జగన్ భరోసా ఇచ్చారు. రైతులకు పరిహారం సాధిస్తానని ఆయన చెప్పారు. జగన్ దీక్ష మూడు రోజుల పాటు సాగుతుంది.