జూన్ 8 న సచివాలయంలోకి జగన్ ఎంట్రీ.. అదే రోజున?
Published on: Fri May 31, 2019 4:58PM

ఏపీ సీఎం వైఎస్ జగన్ జూన్ 8వ తేదీన సచివాలయంలో అడుగుపెట్టనున్నారు. ఆ రోజు ఉదయం 8:39 గంటలకు తన ఛాంబర్‌లోకి జగన్ ప్రవేశించనున్నారు. అదే రోజు మంత్రివర్గ ఏర్పాటు, కొత్త మంత్రుల ప్రమాణం స్వీకారం ఉంటుందని సమాచారం. సచివాలయం పక్కనే ఉన్న స్థలంలో మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆ కార్యక్రమం ముగిసిన వెంటనే మొదటి కేబినెట్ సమావేశం ఉంటుంది. 25 మంది సభ్యులను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కేబినెట్‌లో బెర్త్‌ల కోసం ఆశావహులు జగన్ ఇంటికి క్యూ కడుతున్నారు. మంత్రి పదవి కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు.


