ప్రతి పనిలో జగన్ మార్క్... క్లారిటీ మిస్సవుతున్న జగన్..?

 

దాదాపు పదేళ్ల కష్టం, తండ్రి చావు నుండి మొదలు నేటి సిఎం కుర్చీ దాకా సాగింది జగన్ ప్రస్తానం. అయితే ఆయన సిఎం స్థానం ఎంత కష్టపడి సంపాదించాడో ఆ సీటులో ఉండి చేసే పనుల ద్వారా అంతే పేరు తెచ్చుకోవాలని తద్వారా తన సిఎం స్థానం పదిలపరచుకోవాలని ఆయన చూస్తున్నాడు, హామీల పేరుతో నవరత్నాల మొదలు ఆయన చేపట్టిన చేపడుతున్న హామీలు జనాల్లోకి గుర్తుండిపోయేలా చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. నిన్న జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ మొదటి సమావేశం జరిగింది. ఈ కేబినెట్ సమావేశంలో జగన్ కొత్తగా ఏమీ నిర్ణయాలు తీసుకోలేదు, ముందుగా తీసుకున్నవి అమలు పరుద్దామని ఫిక్స్ అయినా నిర్ణయాలలో కొన్నిటిని ఆమోదింపచేసి, కొన్నిటికి కమిటీలు నియమించాలని తీర్మానించారు, అయితే తీసుకునే ప్రతి నిర్ణయం జనాల్లో మంచి పేరు తెచ్చే విధంగా ప్లాన్ చేస్తున్నారు జగన్. నిజానికి నిన్న తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే ముందుగా ప్రమాణ స్వీకారం రోజున సంతకం పెట్టిన పెన్షన్ల పెంపు నిర్ణయాన్ని ఆమోదించారు, అయితే ఈ 250 పెంపకం అనే అంశం ఎన్నో విమర్శలకి తావిచ్చినా ఆయన దాని మీదే కట్టుబడి ఉన్నారు. ఇక ఆశా వర్కర్ల జీతాల పెంపు విషయానికి వస్తే కొద్దీ రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా బాబు ప్రభుత్వం వారి జీతాలను 8500 చేసింది, ఇప్పుడు జగన్ పెంచింది పదిహేను వందలే అయినా దానిని ప్రమోషన్ ఆబ్ జెక్టివ్ గా వాడుకోడానికి ఫిక్స్ అయ్యింది జగన్ ప్రభుత్వం.

అంతేకాక ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం ప్రక్రియ గురించి కూడా ఒక కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇది సాధ్యమయ్యే పని కాదు, ఎందుకంటే నిజాం రైల్వేస్ సంస్థ నుండి ఈ ఆర్టీసీ ఏర్పడింది, విలీనానికి సాధ్యం కానీ ఎన్నో లొసుగులు ఈ వ్యవహారంలో ఉన్నాయి, సో ఇప్పటికిప్పుడు ఆర్టీసీ సంఘాలు సమ్మెకు దిగకుండా కమిటీ పేరు చెప్పి ఆ సంఘాల నోరు మూయించారని చెప్పచ్చు. ఇక కేబినెట్ లో తీసుకున్న మరో నిర్ణయం రేషన్ డోర్ డెలివరీ, ఇప్పటికే ఏపీలో పెన్షన్లు డోర్ డెలివరీ చేస్తున్నారు. అదే పద్దతిని ఇప్పుడు రేషన్ సరుకుల విషయంలో కూడా ఫాలో కానున్నారు. ఈ దెబ్బకి జనాల్లో మంచి పేరు రావడం ఖాయం, ఎందుకు అనగా ఒకప్పుడు రేషన్ కోసం క్యూలలో ఉండాల్సిన పరిస్థితి ఉండేది, టెక్నాలజీ పుణ్యమా అని ఆ క్యూలు తగ్గినా మిషన్లు సరిగ్గా పని చేయక గంటల తరబడి ఆ రేషన్ షాపుల ముందు పడిగాపులు పడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి, కానీ కొత్త ప్రభుత్వ నిర్ణయంతో జనాలు ఈ మేరకు ఉపశమనం పొందనున్నారు.

ఇక వాలంటీర్ల విషయానికి వస్తే ఇదే కాస్త ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. ఎందుకంటే జగన్ ఈ విషయంలో క్లారిటీ మిస్సవుతున్నారు. మొదట నుండి ఈ విషయం మీద కన్ఫ్యూషన్ అలాగే ఉంది, అదేంటంటే తొలుత ఊరికి పదిమంది అన్నారు, తర్వాత వార్డుకు ఒక్కరు అన్నారు, ఇప్పుడు 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ అంటున్నారు. దీంతో ఈ వ్యవస్థ ఏర్పాటు, పని తీరు మీద ఇంకా ఏర్పడక ముందే నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. నిజానికి ఇలాంటి తప్పిదమే చేసిన తెలుగుదేశం ఘోరంగా దెబ్బతిన్నది. జన్మభూమి కమిటీల పేరుతో తమ పార్టీ వారికి అధికారాలు ఇచ్చ్చిన ప్రభుత్వ పెద్దలు, సామాన్య జనాల్లో చాలా చెడ్డపేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు వైసీపీ జాగ్రత్త పడకుంటె ఈ వ్యవస్థ కూడా వైసీపీని అంతే దెబ్బ తీసే అవకాశం కనిపిస్తోంది. ఇక జగన్ ఎంతో గొప్పగా చెప్పుకున్న నవరత్నాల లో ఒకటయిన బడికి పిల్లల్ని పంపిస్తే తల్లితండ్రులకి వేతనం ఇచ్చే పధకం కూడా ఒకటి, అయితే ఈ పధకం ప్రభుత్వ బడుల్లో చదివే పిల్లలకి మాత్రమే పరిమితం చేస్తూ తీసుకున్న నిర్ణయం కూడా పాలనలో జగన్ మార్క్ చూపడానికి పనికొచ్చేదిగా ఉంది, ఎందుకంటే ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్చడానికి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎన్నో కష్టాలు పడుతున్నా ప్రభుత్వ బడుల్లో చేరే పిల్లల శాతం చాలా తక్కువ కానీ జగన్ నిర్ణయంతో ఆ శాతాన్ని పెంచవచ్చు, అది పెరిగితే ప్రయివేట్ స్కూల్స్ డబుల్ రేట్లు అదుపులోకి వస్తాయి. అలా ఒకే దెబ్బకి రెండు పిట్టలు పడేలా జగన్ ప్లాన్ చేసినట్టు ఇక్కడ అర్ధం చేసుకోవచ్చు. అంతేకాక ఎప్పుడూ వినపడే కాంట్రాక్ట్ ఉద్యోగాల క్రమబద్దీకరణ అంశం కూడా ప్రభుత్వం చేతికి మట్టి అంటకుండా కమిటీ వేసి సైడ్ అయ్యారు. ఇలా ఒక్కటి కాదు ఏపీ రైతు కమిషన్, పంటకు గిట్టుబాటు ధర, ఉచిత బోర్లు, లాంటి ఎన్నో నిర్ణయాలలో జగన్ తన మార్క్ చూపడానికి ప్రయత్నిస్తున్నారు.