TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

యూపీ సీఎంతో ములాయం కొడుకు భేటీ.. సర్వత్రా ఆసక్తి...

Published on: Fri Mar 24, 2017 12:57PM

 

యూపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ అనూహ్య విజయం సాధించి అధికారం చేజిక్కించుకున్న సంగతి తెలిసిందే. 400 పైగా ఉన్న అసెంబ్లీ స్థానాలకు గాను.. 300 లకు పైగా స్థానాలు గెలిచి అందరికి షాకిచ్చింది. ఇక బీజేపీని ఎలాగైనా ఓడించాలని పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్-సమాజ్ వాదీ పార్టీల ప్లాన్ ను వర్కవుట్ కాలేదు. అన్ని పార్టీల దిమ్మతిరిగే షాకిస్తూ బీజేపీ గెలిచింది. ఇక యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. అయితే ఇప్పుడే యూపీలో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే... సమాజ్ వాదీ పార్టీ అధినేత చిన్న కుమారుడు ప్రతీక్‌ యాదవ్, ఆయన భార్య అపర్ణా యాదవ్ సీఎం యోగితో భేటీ అవ్వడమే. వీవీఐపీ అతిథి గృహానికి వచ్చిన ప్రతీక్, అపర్ణ దంపతులు సీఎం యోగితో మంతనాలు జరిపారు. అయితే వీరు ఏ విషయంపై చర్చించారని బయటకు రాలేదు కానీ.. వీరి భేటీపై మాత్రం ప్రాధాన్యత ఏర్పడింది. వీరు ఎందుకు సీఎంతో భేటీ అయ్యారబ్బా అని పలువురు చర్చించుకుంటున్నారు. మరి వారు ఎందుకు భేటీ అయ్యారో వారు చెబితేనే కానీ తెలీదు.. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే. కాగా లక్నో కంటోన్మెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అపర్ణా యాదవ్.. బీజేపీ అభ్యర్థి రీటా బహుగుణ చేతిలో 33,796 ఓట్లతో ఓడిపోయిన సంగతి తెలసిందే.