బండి గట్టెక్కింది.. అయినా..!
Published on: Wed May 13, 2026 2:54PM
.webp)
ఎట్టకేలకు కథ సుఖాంతమైంది.
వారం రోజులుగా నట్టేట ఇరుక్కున్న “ప్రజాస్వామ్యం” అనే బండి గట్టెక్కింది.
కానీ రాజ్యాంగపు రహదారిలో
మరోసారి ఇంకో బండి ఇలానే ఇరుక్కోకూడదంటే
కేవలం లాగడం కాదు…
శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది.
అడ్డొచ్చిన ప్రతి ఏటిమార్గానికి
వారధులు కట్టినప్పుడే
ఈ రహదారి నిజమైన రాజబాట అవుతుంది.
విజ్ఞతతో ఆలోచించండి విజ్ఞులారా..!
ఈ గణితపు లెక్కలు ప్రమాదకరం.
రాజకీయ బేరసారాలు రంజుగా సాగినా
ఇలా గట్టెక్కిన బండి ఎంతదూరం ప్రయాణిస్తుందో చెప్పలేం.
అడుగడుగునా గండాలే…
ఆయారాం-గయారాంలకు పండగే..!
అయితే ఈ రాజకీయ గణితాలకు
ఓటర్లను తప్పుపట్టలేం కదా..!
శాసనసభ నాయకుడిని
గవర్నర్ ద్వారా కాకుండా
ప్రజల ప్రత్యక్ష ఎన్నికల ద్వారా ఎన్నుకునే విధానం వస్తేనే
ఇలాంటి అనిశ్చితికి ముగింపు దొరకొచ్చు.
అప్పుడు “మ్యాజిక్ ఫిగర్” అనే మాటకే అర్థం ఉండదు.
మెజారిటీ ప్రజలు ఎన్నుకున్న నాయకుడే పాలన చేపడతాడు.
అలాంటి ప్రభుత్వం ఐదేళ్లు స్థిరంగా కొనసాగగలదు.
ఎలాగూ ప్రతి బిల్లుకూ సభలో ఓటింగ్ ఉంటుంది.
మంచి పనిని ఎవరూ అడ్డుకోలేరు కదా..!
మారాలి… మారాలి మన రాజ్యాంగం.
అనిశ్చితి రాజకీయాలకు అంతం పలకాలి..!
డా వి.డి.రాజగోపాల్.


