Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...ప్రజలకు మాస్కులు పంచిన స్టాలిన్.. మన సీఎంలూ ఉన్నారే..
posted on: Jan 4, 2022 5:18PM
తమిళనాడులో కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. నిన్నటి దాకా వరదలు ముంచెత్తితే.. ఇప్పుడు కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతుండటంతో అన్నిరాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. ప్రజలంతా మాస్కులు, సామాజిక దూరం తప్పక పాటించాలని.. వ్యాక్సిన్ వేసుకోని వారంతా రెండు డోసులు తప్పక తీసుకోవాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలో.. తాను నిత్యం ప్రయాణించే మార్గంలో కొందరు ప్రజలు మాస్కులు పెట్టుకోకపోవడాన్ని గమనించిన తమిళనాడు సీఎం స్టాలిన్.. వారికి మాస్కులు పంచారు. స్వయంగా కొందరికి మాస్కులు తొడిగారు.
చెన్నై రోడ్లపై మాస్కు లేకుండా ఉన్న వారిని చూసిన స్టాలిన్ వెంటనే తన కాన్వాయ్ ఆపించారు. కారు దిగొచ్చి మాస్కులు పంచారు. ఇలా మార్గమధ్యలో పలుచోట్ల కారు ఆపి.. మాస్కులు తొడిగి.. ఔరా అనిపించారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో సైతం ప్రజలంతా మాస్కులు ధరించాలంటూ.. స్వయంగా ఆయనే ఓ వీడియో చేసి రిలీజ్ చేశారు.
మాస్కులు పంచడంపై ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు. "హెడ్ క్వార్టర్స్ నుంచి క్యాంప్ ఆఫీసుకు వెళ్తుండగా బహిరంగ ప్రదేశాల్లో కొంత మంది మాస్క్‌లు పెట్టుకోకపోవడం కనిపించింది. వారికి మాస్క్‌లు అందించాను. ప్రతి ఒక్కరు మాస్క్‌లు ధరించాలని వారికి సూచించాను. కొవిడ్ భయంకరంగా వ్యాపిస్తోంది. వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవాలంటే మాస్క్‌లు ధరించడం చాలా అవసరం. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను విజ్ణప్తి చేసేది ఏంటంటే.. మాస్క్‌లు తప్పకుండా ధరించండి" అని సీఎం స్టాలిన్ ప్రజలకు పిలుపిచ్చారు.
ముఖ్యమంత్రి అయినప్పటి నుంచీ స్టాలిన్ ప్రజలతో మమేకమవుతున్నారు. జనాలతో కలిసిపోతున్నారు. వాకింగ్, సైక్లింగ్, ఆకస్మిక తనిఖీలతో యాక్టివ్‌గా ఉంటున్నారు. అదే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉన్నారే... అంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. సీఎం కేసీఆర్ ప్రగతిభవన్, ఫాంహౌజ్‌లో సెటిలైతే.. సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్‌లో సేద తీరుతున్నారని విమర్శిస్తున్నారు. ఇక కొవిడ్ కట్టడి విషయంలో ఈ ఇద్దరు సీఎంలు అట్టర్‌ఫ్లాప్ అనే టాక్. ఇక, ముఖ్యమంత్రి జగన్ మాస్క్ పెట్టుకొని కనిపించిన సందర్భాలు అత్యంత అరుదు. కేసీఆరూ అంతే. ఇక, స్టాలిన్‌లా జగన్, కేసీఆర్‌లు మాస్కులు పంచే కార్యక్రమాన్ని అస్సలు ఊహించుకోలేమంటున్నారు. వాళ్లే మాస్కులు పెట్టుకోరు.. ఇక జనాలకేం మాస్కులు పెడతారు.. మస్కా కొట్టడానికైతే రెడీ అంటారుగానీ...అంటున్నారు.



.webp)


