‘డీలిమిటేషన్’ ప్రతులను దహనం చేసిన సీఎం స్టాలిన్
Published on: Thu Apr 16, 2026 5:17PM
.webp)
నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) బిల్లుపై తమిళనాడులో రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆందోళన వ్యక్తం చేశారు. నిరసనలో భాగంగా బిల్లు ప్రతులను ఆయన బహిరంగంగా దహనం చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది.
ఈ సందర్భంగా మాట్లాడిన స్టాలిన్, గతంలో తమిళనాడులో హిందీ విధానానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు దేశవ్యాప్తంగా ప్రభావం చూపాయని గుర్తుచేశారు. ఆ ప్రతిఘటన జ్వాలలు ఢిల్లీని కుదిపేశాయని, ఇప్పుడు డీలిమిటేషన్ బిల్లును తగలబెట్టడం ద్వారా మరోసారి ఆగ్రహ జ్వాలలను రగిలిస్తున్నామని తెలిపారు. ఈ మంటలు బీజేపీ అహంకారాన్ని అణచివేస్తాయని, రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం తమ పోరాటం కొనసాగుతుందని స్టాలిన్ స్పష్టం చేశారు.


