TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం రేవంత్ శ్రీరామ‌న‌వ‌మి శుభాకాంక్ష‌లు

Published on: Thu Mar 26, 2026 7:53PM

 

రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలిపారు. భద్రాద్రి సీతారాముల ఆశీస్సులతో దేశంలోని ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించాలని స్వామివారిని ప్రార్థించారు. భ‌ద్రాద్రి రామాలయాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేసేందుకు ప్రజా ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.351 కోట్లు కేటాయించామన్నారు. భద్రాద్రి శ్రీరాముని క్షేత్ర ప్రాధాన్యం దేశమంతటికీ చాటేలా ఘనంగా నవమి వేడుకలు జరుపుకోవాలన్నారు. 

భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు.శ్రీ రాముడు నడయాడిన భద్రాచలంలో శ్రీసీతారామచంద్రస్వామి దేవాలయం అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మనస్సుతో నిధులు మంజూరు చేశారని  మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.  శ్రీసీతారామచంద్రస్వామి దంపతులకు ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను సీఎం రేవంత్ రెడ్డి సమర్పించనున్నారని తెలిపారు. అందుకు శుక్రవారం భద్రాచలానికి సీఎం రేవంత్‌ వస్తున్నారన్నారు. ఆయనకు ప్రజల తరఫున ఘనంగా స్వాగతం పలుకుతామని మంత్రి వెల్లడించారు.