TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాధారణ ట్రాఫిక్‌లోనే సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్

Published on: Thu May 7, 2026 5:51PM

 

శంషాబాద్ విమానాశ్రయం నుంచి తన నివాసానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  కాన్వాయ్ ఈసారి పూర్తిగా సాధారణ ట్రాఫిక్ మధ్యనే ప్రయాణించడం నగరంలో ప్రత్యేక చర్చకు దారితీసింది. సాధారణంగా ముఖ్యమంత్రి కాన్వాయ్ రాకపోకల సమ యంలో ప్రధాన రహదారుల్లో ట్రాఫిక్‌ను పూర్తిగా నిలిపివేయడం పరిపాటి కాగా, ఈసారి ఆ విధానానికి పూర్తిగా భిన్నంగా చర్యలు తీసుకోవడం గమనార్హం.

ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులతో జరిగిన సమీక్షలో, తన కాన్వాయ్ కోసం నగర వాహనాలను పూర్తిగా నిలిపివేయాల్సిన అవసరం లేదని, ప్రజలకు అసౌకర్యం కలిగించే చర్యలను తగ్గించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. రహదారులపై సాధారణ ప్రజల ప్రయాణం ఇబ్బందులకు గురి కాకుండా చూడా లని, ట్రాఫిక్ నిర్వహణను మరింత సమతుల్యంగా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  సూచించినట్లు పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఈ ఆదేశాల నేపథ్యంలోనే ఈరోజు శంషాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం కాన్వాయ్ నగరంలోకి ప్రవేశించిన సమయంలో ట్రాఫిక్ ను ఆపకుండా  కేవలం అవసరమైన చోట్ల మాత్రమే నియంత్రణలు అమలు చేశారు. కొన్ని ప్రధాన కూడళ్ల వద్ద వాహనాలను తాత్కాలికం గా ఆపి, తర్వాత సింగిల్ లైన్ విధానంలో వాహనాలను అనుమతిస్తూ ట్రాఫిక్ పోలీసులు పరిస్థితిని సమర్థవంతంగా నిర్వహించారు. ఈ విధానం వల్ల సాధారణ ప్రయాణికులకు పెద్దగా అంతరాయం కలగలేదు. 

నగరంలోని ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు కొనసాగుతూనే ఉండటంతో ప్రజలు కూడా ఈ మార్పును సానుకూలంగా చూస్తు న్నారు. సాధారణంగా వీఐపీ కాన్వాయ్‌ల కారణంగా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోతుందని జనాల నుండి విమర్శలు వినిపించే నేపథ్యంలో... ఈ కొత్త విధా నం ఒక మార్పుగా కనిపి స్తోంది.

ట్రాఫిక్ అధికారులు కూడా ఈ విధానం వల్ల ట్రాఫిక్ ఒత్తిడి తగ్గిందని, భవిష్యత్తులో అవసరాన్ని బట్టి ఇలాంటి సమతుల్య నియంత్రణ విధానాన్ని కొనసాగించవచ్చని సూచిస్తున్నారు. ప్రజలకు అసౌకర్యం తగ్గిస్తూ, భద్రతా ప్రమాణాలను కాపాడేలా ఈ విధానాన్ని మరింత మెరుగుపరచనున్నట్లు సమాచారం. మొత్తానికి ముఖ్యమంత్రి కాన్వాయ్ సాధారణ ట్రాఫిక్‌లో ప్రయాణించడం రాష్ట్ర రాజధాని నగరంలో కొత్త చర్చకు దారితీసింది.