మనవడి కోసం స్వయంగా పూరీలు చేసిన సీఎం రేవంత్ రెడ్డి.!
Published on: Fri Jul 10, 2026 11:56AM

తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా రేవంత్ రెడ్డి ఇంట్లో మనవడికి తాతే. సేవకుడే. మనవడు అడిగితే.. వంటింట్లో పూరీలు వేసి తీరాల్సిందే. ఔను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన ఇంట్లో వంటింట్లో మనవడి కోసం పూరీలు వేస్తున్న చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
మాజీ ప్రధానమంత్రి దివంగత సీవీ నరసింహరావు గతంలో ఒక సారి ఢిల్లీకి రాజైనా అమ్మకు కొడుకే అన్నారు. అలా ఇప్పుడు రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి అయినా.. మనవడికి ఆటబొమ్మలాంటి తాతే అని రుజువు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి రాజకీయాల్లో, పాలనా వ్యవహారాల్లో ఎంత బిజీ అయినా.. గారాల మనవడు అడిగితే.. వంటింట్లో గరిట పట్టాల్సిందే. తాజాగా ముఖ్యమంత్రి తన నివాసంలో తన మనవడి కోసం వంటగదిలో పూరీలు చేసిన ఆసక్తికరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. పరిపాలన బాధ్యతలను, వ్యక్తిగత జీవితాన్ని రేవంత్ రెడ్డి ఎంత చక్కగా బ్యాలెన్స్ చేసుకుంటారో చెప్పడానికి ఇదే నిలువెత్తు సాక్ష్యమంటున్నారు నెటిజనులు.
తన మనవడి కోసం స్వయంగా పూరీలు చేస్తున్న వీడియోను రేవంత్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. తన ముద్దుల మనవడి డిమాండ్ వల్లే తాను కిచెన్‌లోకి అడుగుపెట్టానని వెల్లడించారు. తాను పూరీలు వేస్తేనే తింటానంటూ.. మనవడు మారాం చేయడంతోనే.. తాతగా ఆ కోరిక నెరవేర్చక తప్పలేదని రేవంత్ చమత్కారంగా పేర్కొన్నారు.
రేవంత్ స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అయ్యింది. వీడియోలో సీఎం రేవంత్ రెడ్డి పిండి కలుపుతూ, పూరీలు వేస్తుంటే..పక్కనే నిలబడి తాతకు ఇన్ స్ట్రక్షన్స్ ఇస్తున్న మనవడు కనిపించాడు. తాత చేత పని చేయిస్తున్నానన్న గర్వం, ఆనందం ఆ మనవడి ముఖంలో ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. ఈ వీడియోపై నెట్టింట ప్రశంసల జల్లు కురుస్తోంది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే తత్వం, కుటుంబానికి ఇచ్చే ప్రాధాన్యత ఇస్తున్న రేవంత్ రెడ్డిని నెటిజనులు పొగడ్తల వర్షంలో ముంచెత్తుతున్నారు.
Revanth Reddy cooking poori, Revanth Reddy grandson Reyansh, Revanth Reddy viral kitchen video


