TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జీవన్ రెడ్డి ఆ దుర్మార్గుడితో జతకట్టాడు : సీఎం రేవంత్ రెడ్డి

Published on: Tue Apr 14, 2026 9:47PM

 

జగిత్యాల ముఖ్య నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు రాష్ట్రంలోని ప్రస్తుత పరిస్థితులను పంచుకోవాలనే ఉద్దేశంతో మీతో ఈ సమావేశం నిర్వహించానని తెలిపారు.మేము ఎప్పుడూ జీవన్ రెడ్డిని తక్కువ చేసి చూడలేదు. ఆయన మర్యాదను దెబ్బతీసేలా ఎప్పుడూ ఆయన మర్యాదను దెబ్బతీసేలా ఎప్పుడూ మాట్లాడలేదు. ఆయన గౌరవాన్ని తగ్గించేలా వ్యవహరించలేదని రేవంత్ వెల్లడించారు. 2023 ఎన్నికల్లో ఆయన గెలుపు కోసం మనమంతా కృషి చేశాం. పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన్ని కరీంనగర్ నుంచి పోటీ చేయాలని సూచించాం. 

అయితే ఆయన నిజామాబాద్ నుంచి పోటీ చేయాలనే అభ్యర్థన మేరకు పార్టీ టికెట్ ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో కూడా జీవన్ రెడ్డి సూచించిన అభ్యర్థులకే టికెట్లు కేటాయించాం. భవిష్యత్తులో ఆయనకు, ఆయన కుటుంబ సభ్యుల రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇచ్చినా ఆయన వినలేదు. మొండి పట్టుదలతో జీవన్ రెడ్డి పార్టీని వీడారు. 40 ఏళ్లుగా ఆయన కోసం పనిచేసిన కార్యకర్తలను నిరాశపరుస్తూ, కేసీఆర్‌తో కలిశారని ముఖ్యమంత్రి అన్నారు.

జీవన్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ వద్ద చేతులు కట్టుకుని నిలబడటం బాధాకరం. జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తల ఆత్మగౌరవాన్ని ఆయన కేసీఆర్ కాళ్ల వద్ద తాకట్టు పెట్టినట్లైందని.. ఆయన వయస్సుకు, అనుభవానికి ఇది తగినది కాదు. అయినప్పటికీ, ఈనాటికీ ఆయన గౌరవానికి భంగం కలిగేలా నేను ఒక్క మాట కూడా మాట్లాడలేదని ముఖ్యమంత్రి తెలిపారు. మనం కుట్రలను తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంటే, ఆయన వెళ్లి అక్కడ చేరడం బాధాకరం. 

ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడటం తప్పా అనే విషయాన్ని మీరు ఆలోచించాలి. నేను చేస్తున్నది మంచిదా చెడా అన్నది మీరు నిర్ణయించండి. ఎవరు ఏమిటి అన్నది కాలమే తేలుస్తుంది. మీరు అందరూ అండగా నిలవాలి. మళ్లీ కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావాలి. ధైర్యంగా ఉండండి. త్వరలోనే కార్యకర్తలను కలిసేందుకు జగిత్యాలకు వస్తాను. మనమంతా కలిసికట్టుగా జగిత్యాలను అభివృద్ధి చేసుకుందాం. వ్యక్తికంటే పార్టీ ముఖ్యమని నిరూపించిన మీ అందరినీ అభినందిస్తున్నాని సీఎం రేవంత్ తెలిపారు