TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ సాధిస్తాం : సీఎం రేవంత్ రెడ్డి

Published on: Mon Dec 8, 2025 3:36PM

 

2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీ నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ ముఖ్యమంత్రి మాట్లాడారు. దేశంలో తెలంగాణ దాదాపు 2.9% జనాభా కలిగి ఉందని  దేశ జీడీపీలో  తెలంగాణ నుంచి దాదాపు 5% వాటాను అందిస్తున్నామని తెలిపారు. 

2047 నాటికి భారతదేశ జీడీపీ 10% వాటాను తెలంగాణ నుంచి అందించాలన్నది మా లక్ష్యమని రేవంత్ రెడ్డి అన్నారు. సేవారంగం, తయారీ రంగం, వ్యవసాయ రంగం... ఇలా తెలంగాణను స్పష్టమైన 3 భాగాలుగా విభజించామని పేర్కొన్నారు. మూడు భాగాలుగా విభజించి ప్రాంతాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్ధేశించుకున్న రాష్ట్రాల్లో దేశంలోనే తెలంగాణ మొట్టమొదటి రాష్ట్రమని తెలిపారు ఇందుకోసం క్యూర్, ప్యూర్, రేర్ మోడల్స్ నిర్ధేశించామని సీఎం అన్నారు. 

చైనా, జపాన్, జర్మనీ, దక్షిణ కొరియా, సింగపూర్ దేశాల నుంచి మేమెంతో ప్రేరణ పొందామని తెలిపారు. ఇప్పుడు మేం ఆ దేశాలతో పోటీ పడాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు.  తెలంగాణ రైజింగ్ ప్రయాణంలో సహకరించడానికి, పెట్టుబడి పెట్టడానికి, మాకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని ఆకాంక్షిస్తూ మీఅందరినీ ఆహ్వానించామని సీఎం తెలిపారు. తెలంగాణ అన్ స్టాపబుల్ అని అన్నారు. దీంట్లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.