TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాసన..ఎందుకంటే?

Published on: Mon Aug 4, 2025 2:52PM

 

సీఎం రేవంత్‌రెడ్డికి హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన  కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ క్రీడా రంగ అభివృద్ధికి ఉద్దేశించిన  ‘స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణ’ను ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు చైర్మన్‌గా సంజీవ్ గోయెంకాను నియమించింది. మెగా కోడలు ఉపాసన కామినేనిని కో చైర్మన్‌గా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి ఉపాసన ధన్యవాదాలు తెలిపారు. ఎక్స్ వేదికగా ఉపాసన స్పందిస్తూ... సీఎం రేవంత్ కు థ్యాంక్స్ చెప్పారు. 

సంజీవ్ గోయెంకాతో కలిసి పనిచేసే అవకాశం రావడాన్ని గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ ఒలింపిక్ సంఘం ఉపాధ్యక్షుడు వేణుగోపాలాచారి, క్రీడలు, యువజన సర్వీసుల ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ కు ధన్యవాదాలు తెలిపారు. క్రీడారంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందడం కోసం తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025'ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా స్పోర్ట్స్ హబ్ ఆఫ్ తెలంగాణను రూపొందించింది.