TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు పిలిస్తే వస్తా : సీఎం రేవంత్

Published on: Wed Jul 23, 2025 9:35PM

 

ఫోన్ టాపింగ్ కేసులో నన్ను విచారణకు పిలిస్తే వస్తాని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టాపింగ్ జాబితాలో నా ఫోన్ నెంబర్ ఉందో లేదో తెలియదన్నారు. గత ప్రభుత్వం పెద్దలుసొంత కుటుంబ సభ్యులపై ఫోన్ టాపింగ్ చేశారు అంతకంటే ఆత్మహత్య చేసుకోవడం మేలని సీఎం స్పష్టం చేశారు.  బీసీ రిజర్వేషన్ల విషయంలో ఏ సమస్య వచ్చినా....స్థానిక సంస్థల ఎన్నికలు  ఆగే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి తెలిపారు. 

ఫోన్ టాపింగ్ కాలేదని అనుకుంటున్నా. నా ఫోన్ టాపింగ్ అయి ఉంటే నన్ను పిలిచేవారు కదాని ఆయన పేర్కొన్నారు. ఫోన్ టాపింగ్ ఇల్లీగల్ కాదు.. కానీ లీగల్ గా పర్మిషన్ తీసుకుని చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ కూడా విన్నారని అంటున్నారు సొంత కుటుంబ సభ్యులకు ఫోన్ లే టాపింగ్ చేసి వినాల్సిన పరిస్థితి వస్తే సూసైడ్ చేసుకోవడం ఉత్తమని ముఖ్యమంత్రి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ తన ఫోన్ టాప్ అవుతుందని మొదట ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశాడని  సీఎం రేవంత్ స్పష్టం చేశారు. 

పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో 50 శాతం నిబంధన దాటిపోయిందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఈబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు అడ్డురాని నిబంధనలు బీసీ రిజర్వేషన్లకు అడ్డు వస్తున్నాయా? అని ధ్వజమెత్తారు. కేంద్ర పదవుల్లోనూ బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న బీసీని తొలగించారని, ఇప్పటికే దత్తాత్రేయను గవర్నర్ పదవి నుంచి తొలగించారని ఆయన అన్నారు. దత్తాత్రేయకు ఉపరాష్ట్రపతి పదవి ఇవ్వాలని సీఎం డిమాండ్ చేశారు.