TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం : సీఎం రేవంత్

Published on: Wed Jul 23, 2025 6:48PM

 

 

తెలంగాణలో నిర్వహించిన కులగణన దేశానికే రోల్ మోడల్‌గా నిలిచాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. వందేళ్లుగా వాయిదాపడ్డ కులగణనను నెలరోజుల్లో పూర్తి చేశామన్నారు.  స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్లు కోసం తీర్మానాలు చేసి కేంద్రానికి పంపినా జాప్యం జరుగుతోందని సీఎం పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్లపై బీజేపీ వితండవాదం చేస్తోందని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. గుజరాత్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలో ముస్లిం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయని సీఎం తెలిపారు. 

మీరు ఇచ్చిన హామీని మీరు అమలు చేసుకోవాలని బీజేపీ వాళ్లు అంటున్నారని ఇది వితండవాదం కాక మరేంటని సీఎం రేవంత్ ప్రశ్నించారు. హర్యానా మాజీ గవర్నర్  బండారు దత్తాత్రేయకు ఉప రాష్ట్రపతి పదవి ఇవ్వాలని కేంద్రానికి రేవంత్‌రెడ్డి  సూచించారు. ఆయనకు ఆ పదవి కట్టబడితే బీసీలందికీ న్యాయం చేసినట్లు అవుతుందని ఆయన పేర్కొన్నారు. తెలుగు వారికి సరైన గౌరవం దక్కుతుందని తెలిపారు. తాను ఇండియా కూటమి తరపున మాట్లాడటం లేదని.. తెలంగాణ ప్రజల తరఫున తన అభిప్రాయాన్ని చెప్పానని అన్నారు. 

బండారు దత్తాత్రేయను ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తే.. తాను ఇండియా కూటమితో మాట్లాడుతా సీఎం రేవంత్ అన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే‌తోపాటు పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సమావేశమై.. కుల గణన, రిజర్వేషన్లపై చర్చిస్తామని స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం రాహుల్‌ గాంధీ ద్వారా కేంద్రంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు