TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నిరుద్యోగుల నోటికాడ ముద్ద లాగేసే కుట్ర : సీఎం రేవంత్‌రెడ్డి

Published on: Wed May 28, 2025 5:02PM

 

రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. బాబూ జగ్జీవన్‌రామ్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన గురుకుల అవార్డుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. కాంగ్రెస్ ఏర్పడిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ పేర్కొన్నారు. బాబాసాహెబ్ అంబేడ్కర్‌ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని  సీఎం తెలిపారు. ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. అనేక మందిమహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు.. చదువు మాత్రమే. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే విద్యాతోనే సాధ్యమవుతుంది. సమాజంలో రుగ్మతలు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉంది. కార్పొరేట్‌ విద్యాసంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్స్‌ నిర్మిస్తున్నామని పేర్కొన్నారు. 

ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు చదువులు వద్దు.. కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారు. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారని సీఎం పేర్కొన్నారు. అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలి. నోటికాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్టుగా కేసులు వేస్తున్నారు. ఆర్నెల్లు కూడా విరామం లేకుండా వాళ్ల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు. విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కకుండా చేస్తున్నారు రేవంత్ అన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కడుతుంటే అది స్కామ్ అని నన్ను విమర్శిస్తున్నారని ఆయన తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల పిల్లలకు 25 వేల కోట్లు ఖర్చు పెట్టి స్కూళ్లు నిర్మిస్తున్నామని ఆయన తెలిపారు. మేము కార్పొరేట్ కాలేజీలతో పోటీ పడే లాగా ఒక్కో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ పాఠశాల 200 కోట్లు పెట్టి కడుతున్నామని ఆయన అన్నారు.