TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌‌‌తో కేటీఆర్ భేటీ..అందుకోసమేనా?

Published on: Sun May 25, 2025 4:17PM

 

బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌‌ను ఆపార్టీ  వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్‌‌లో కలిశారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత రాసిన లేఖ దాని పరిణామాలపై చర్చించినట్లు తెలుస్తోంది. కాళేశ్వరం నోటీసులతో పాటు తాజా పరిస్థితులపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. కవిత తండ్రి కేసీఆర్‌కు ఆమె లేఖ రాయటం.. పార్టీలోని కొంతమందిపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేయటం చర్చనీయాంశంగా మారింది. ‘

కేసీఆర్ దేవుడు.. ఆయన చుట్టూ దెయ్యాలు ఉన్నాయి’ అని కవిత అనటంతో తీవ్ర దుమారం రేగింది. కవిత చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్‌ పరోక్ష వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘అంతర్గత విషయాలను ప్రస్తావించేందుకు పార్టీ వేదికలు ఉంటాయి. అధ్యక్షుడిని కలిసే అవకాశం ఉంటుంది. ఆఫీసు బేరర్స్‌ను కలిసి చెప్పుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే బాగుటుందంటూ నిన్న(శనివారం) జరిగిన సమావేశంలో కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. మరోవైపు కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నారంటూ రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుంది.