TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం రేవంత్‌రెడ్డితో నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ భేటీ

Published on: Sat May 17, 2025 9:45PM

 

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఆదాయాన్ని పెంచేందుకు ఉన్న మార్గాలు తదితర అంశాలపై చర్చించారు. త్వరలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని అభిజిత్‌ బెనర్జీని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారు. ఫ్యూచ‌ర్ సిటిలో ఆర్ట్స్ అండ్  క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాల‌ని బెనర్జీ సూచించారు. 

సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా, రాష్ట్ర ప్రగతికి దోహదపడే పలు సూచనలను అభిజిత్ బెనర్జీ సీఎం రేవంత్‌కి అందించారు. ముఖ్యంగా, ఫ్యూచర్ సిటీ ప్రణాళికలో కళలు, చేతివృత్తులు, సృజనాత్మకతను అంతర్భాగం చేయాలని ఆయన సూచించారు. అంతేకాకుండా, సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేందుకు వీలుగా ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులను నిర్వహించాలని కూడా సూచించారు.