TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రులు ఎంతెంత కమీషన్ తీసుకున్నారో విచారణ జరిపించండి.. సీఎం రేవంత్‌కు కిషన్ రెడ్డి డిమాండ్

Published on: Fri May 16, 2025 3:39PM

 

మంత్రులు కమిషన్లు తీసుకుంటారని మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని  స్వయంగా ఒప్పుకున్నారు. ఎవరు ఎంత కమీషన్ తీసుకున్నారో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణ జరిపించాలని  కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంత్రులు కమీషన్లు తీసుకుంటున్నారని స్వమంగా మంత్రే ఒప్పుకోవడం దురదృష్టకరమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 

18 నెలల రేవంత్ పాలనలో ఎవరెవరు ఎంతెంత కమీషన్లు తీసుకున్నారో వెంటనే దర్యాప్త చేయించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మంత్రులు తీసుకున్న కమీషన్ల వివరాలను ప్రజల ముందుంచాలని కేంద్రమంత్రి వెల్లడించారు. కాశ్మీర్ పహల్గాం ఉగ్ర దాడికి కౌంటర్‌గా ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్థాన్‌కు గట్టి జవాబు చెప్పామని అన్నారు. పీవోకేలో ఉగ్రవాద శిబిరాలను నెలమట్టం చేశామని పేర్కొన్నారు. భారత్ రాఫెల్ విమానాలను ధ్వంనం చేశామంటూ.. దిక్కుతోచని స్థితిలో పాక్ తప్పుడు ప్రచారం చేస్తుందని అన్నారు. దాయాదుల దాడులకు త్రివిధ దళాలు సమర్ధవంతంగా తిప్పికొట్టాయని కిషన్ రెడ్డి తెలిపారు.