TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం రేవంత్‌రెడ్డిపై ఎంపీ ఈటెల ఘాటు వ్యాఖ్యలు ...కొట్లాడితే ధీరుడితో కొట్లాడుతా

Published on: Mon May 12, 2025 7:09PM

 

సీఎం రేవంత్‌రెడ్డిపై మల్కాజ్‌గిరి ఎంపీ ఈటెల రాజేందర్  ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ ఒక సైకో.. ఎవరు చెప్పినా వినడు అంటూ ఈటల షాకింగ్ కామెంట్స్ చేశారు. కొట్లాడితే దీరుడితో కొట్లడతాం కానీ రండలతో ఏం కొట్లాడతామన్నారు. ముఖ్యమంత్రి కానప్పుడు తడిబట్టలపై భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రమాణం చేశాడు. రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అనే వాడు ప్రజల కష్టాలు తెలుసు కోవాలని ఆయన అన్నారు. ఇలాంటి పిచ్చి వేషాలు మానుకో రేవంత్ రెడ్డి… ఈ కాంగ్రెస్ సర్కార్ ఓ తుగ్లక్ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి ఓ తుగ్లక్ అని ఈటల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గతంలో ధనిక రాష్ట్రమని చెప్పిన రైతులకు రూ.లక్ష కూడా రుణమాఫీ చేయలేకపోయారని ఆరోపించారు. 


మాజీ సీఎం కేసీఆర్  విచ్చలవిడిగా అప్పులు చేసిన రైతుబంధు ఇచ్చారని ఈటల అన్నారు. ఆర్థిక మంత్రిగా చేసిన అనుభవంతో.. కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలు కష్టమని ఆనాడే చెప్పానని అన్నారు. ప్రజలకు అబద్ధాలే నచ్చుతాయని ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి అన్నారని గుర్తు చేశారు. సరిగ్గా 16 నెలలు గడిచే సరికి సీఎం రేవంత్ చెప్పిన అబద్ధాలు అక్షరాల నిజం అవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగర పరిధిలో నిరుపేదల ఇళ్లను కూల్చేస్తున్నారని.. అదేంటని ప్రశ్నిస్తే ఇదే ముఖ్యమంత్రి ఎవరు అడ్డొచ్చినా బుల్డోజర్లతో తొక్కిస్తామని కామెంట్ చేశారని తెలిపారు. ముఖ్యమంత్రిపై ఈటల చేసిన కామెంట్స్‌పై యూత్ కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకుని పలువురు కార్యకర్తలను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.