TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం రేవంత్ సమక్షంలో డీకే అరుణ షాకింగ్ కామెంట్స్

Published on: Sat Jan 17, 2026 7:01PM

 

సీఎం రేవంత్ రెడ్డి  మహబూబ్‌నగర్‌ జిల్లా పర్యటనలో బీజేపీ ఎంపీ డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం పాలమూరును పట్టించుకోలేదని.. మహబూబ్‌నగర్‌ ప్రాజెక్ట్ పూర్తి చేస్తామని మోసం చేశారని విమర్శించారు. ఈ వేదికపై ఉన్నవాళ్లంతా నా ఓటమికి గట్టిగా పనిచేశారు. అయిన అవేమీ పట్టించుకోకుండా అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తాని తెలిపారు. 

కేంద్రం తరపున సహకారం అందించేందుకు కృషి చేస్తామని డీకే అరుణ వెల్లడించారు. కేంద్రం, రాష్ట్ర నిధులు కలిసి ఉపయోగించుకోవాలని ఆమె స్ఫష్టం చేశారు. పాలమూరు అభివృద్ధి బాధ్యత సీఎం రేవంత్‌దే అని తెలిపారు. ముఖ్యమంత్రి  పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేశారు. జడ్చర్లలో ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, చిట్టబోయినపల్లిలో ట్రిపుల్‌ ఐటీ నిర్మాణానికి రేవంత్‌రెడ్డి భూమి పూజ చేశారు.