TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతా : సీఎం రేవంత్‌

Published on: Sun Sep 28, 2025 3:14PM

 

భవిష్యత్తు తరాల కోసమే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాట్లు సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.  రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో భారత్ ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ భవనం, గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్-1 నిర్మాణాలకు శంకుస్థాపన ముఖ్యమంత్రి చేశారు. తనకు ఇక్కడ భూములు ఉన్నాయని అందుకే ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నరని కొందరు అంటున్నారు. నాకు భూములు ఉంటే అందరికీ కనిపిస్తాయి. దాచిపెడితే దాగవు అని తెలిపారు. 

ఎన్నాళ్లుగా న్యూయార్క్, సింగపూర్, దుబాయ్, గురించి చెప్పుకొంటాం మనం కూడా అలా తయారు కావాలి కదా నాకు పదేళ్లు సమయం ఇవ్వండి..న్యూయార్క్‌ను మరిపించే నగరం కడతామని రేవంత్ తెలిపారు.  విజయదశమి రాష్ట్ర ప్రజలకు అన్ని విజయాలను చేకూరుస్తుందని అన్నారు. కుతుబ్ షాహీలు హైదరాబాద్ నగరాన్ని నిర్మిస్తే, వైఎస్సార్, చంద్రబాబు దాన్ని కొనసాగించారు.ఆ నాయకులు ఆలోచన చేశారు కాబట్టే ఇప్పుడు ప్రపంచంతో పోటీ పడుతున్నామని, వారు మనకెందుకులే అనుకుంటే ఓఆర్ఆర్, శంషాబాద్, హైటెక్ సిటీ వచ్చేవి కాదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. 

ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరుకు కనెక్టివిటీ కల్పిస్తున్నామని, ఫ్యూచర్ సిటీకి బుల్లెట్ ట్రైన్ తీసుకురావడానికి కేంద్రాన్ని ఒప్పించామని, అమరావతి నుంచి చెన్నై వరకు బుల్లెట్ ట్రైన్  వస్తుందని, చిన్న చిన్న సమస్యలు ఉంటే పరిష్కరించుకుందామని, కోర్టుల చుట్టూ తిరిగి నష్టపోవొద్దని, అందరిని ప్రభుత్వం ఆదుకోవడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.