వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే
Published on: Thu Aug 28, 2025 5:22PM
.webp)
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్దకు వెళ్లి ఏరియాల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రి ఉత్తమ్, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఉన్నారు. అధికారులను అడిగి వరద పరిస్థితులను తెలుసుకున్నారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టే మనకు ప్రాణవాయువు అన్నారు. నిపుణులు కట్టిన ప్రాజెక్టు కాబట్టే దశాబ్దాలుగా ఎల్లంపల్లి నిలబడిందని, చాలా వ్యూహాత్మక ప్రాంతంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిర్మించారని చెప్పారు. కూలిపోయిన ప్రాజెక్టు, నిలబడిన ప్రాజెక్టుకు మధ్య తేడా ఉందన్నారు. గోదావరి జలాల విషయంలో మనకు ఎల్లంపల్లి చాలా కీలకం అని చెప్పారు.
ఈ సందర్భంగా వరద నియంత్రణపై అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హారీశ్‌రావులను ఉద్దేశిస్తూ రేవంత్‌రెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మామ, అల్లుడు అతి తెలివితేటలతో ఒకరు ఆణిముత్యాం మరొకరు స్వాతిముత్యం అని అన్నారు. కాళేశ్వరం ఘోష్ నివేదికపై శాసన సభల్లో చర్చకు పెడుతామని, మామ అల్లుడు ఎన్ని కుట్రలు చేసిన పాపాలు పోవని విమర్శించారు. మేడిగడ్డ అన్నారం, సుందిళ్ల ప్రాజెక్ట్‌లో లోపాలు ఉన్నాయని వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో సాంకేతిక వైఫల్యం ఉందని సీఎం రేవంత్ తెలిపారు.


