TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

Published on: Sun May 31, 2026 11:07AM

 

శంషాబాద్ నోవాటెల్‌ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇన్ ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా ఖర్గేతో భేటీ అయ్యారు. గంటన్నర పాటు సాగిన ఈ సమావేశంలో తాజా రాజకీయాలపై చర్చించారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది.

 తెలంగాణలో పార్టీ పరిస్థితి, ఎస్ఐఆర్ సహా పలు కీలక అంశాలపై చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐఆర్ ను  ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీ పథకాల పురోగతిని, బడ్జెట్ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి ఈ సందర్భంగా ఖర్గేకు వివరించారు. ఈ వారంలోనే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ తో కూడా ఈ అంశంపై చర్చించి.. జూన్ రెండోవారంలో మంత్రి వర్గ విస్తరణ చేపడుతారని తెలుస్తోంది. ఈ భేటీ తర్వాత మల్లికార్జున ఖర్గే గుల్బర్గాకు వెళ్లనున్నట్లు సమాచారం.