TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

Published on: Thu Mar 26, 2026 10:50AM

మార్కాపురం బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న‌పై ముఖ్య‌మంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్య‌క్తం చేశారు. ప్ర‌మాద ఘ‌ట‌న‌లో  13 మంది మృతి చెంద‌డం.. కొంద‌రికి  తీవ్రంగా గాయపడటంపై  రేవంత్ విచారం వ్యక్తం చేశారు.  మృతుల కుటుంబాల‌కు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని   ఆకాంక్షించారు.

బ‌స్సు నిర్మ‌ల్‌ నుంచి నెల్లూరు వైపు వెళుతున్న నేప‌థ్యంలో బ‌స్సు ప్ర‌మాదంలో మృతిచెందిన వారు.. గాయ‌ప‌డిన వారి వివ‌రాలు తెలుసుకోవాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సీఎస్ రామ‌కృష్ణారావును ఆదేశించారు. ఏపీ అధికారుల‌తో మాట్లాడి పూర్తి వివ‌రాలు సేక‌రించాల‌నీ, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం స‌హాయం అందేలా చూడాల‌ని చెప్పారు.