TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం రమేష్ విన్.. బీజేపీకి షాక్..!!

Published on: Tue Aug 7, 2018 11:32AM

అవిశ్వాస పరీక్షలో గెలిచి ఓడిన బీజేపీ, ఈసారి నిజంగానే ఓడిపోయింది.. పార్లమెంటు ప్రజా పద్దుల కమిటీ(పీఏసీ)కి  చెందిన రెండు సీట్లకు జరిగిన ఓటింగ్‌లో సీఎం రమేష్ అత్యధిక ఓట్లతో పీఏసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు.. నిజానికి టీడీపీకి రాజ్యసభలో కేవలం ఆరుగురు సభ్యులే ఉన్నారు.. కానీ, విపక్ష సభ్యులంతా అండగా నిలవడంతో రమేష్ కు 106 ఓట్లు వచ్చాయి.

 

 

ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌, వైసీపీ కూడా రమేష్ కే మద్దతు పలకడం విశేషం.. ఇక విశ్వాసపరీక్షలో మోదీ సర్కారుకు మద్దతుగా నిలిచిన అన్నాడీఎంకే కూడా రమేష్ కే ఓటేసి బీజేపీకి షాక్ ఇచ్చింది.. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌, వైసీపీ, అన్నాడీఎంకే, వామపక్షాలు, బీజేడీకి చెందిన ఎంపీలందరూ రమేష్ కు అండగా నిలిచారు.. మరోవైపు బీజేపీ అభ్యర్థి భూపేంద్ర యాదవ్‌కు 69 ఓట్లే లభించాయి.. ఇక బీజేపీ మద్దతుతో పోటీ చేసిన జేడీయూ అభ్యర్థి హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌కు కేవలం 26 ఓట్లు రావడంతో ఆయన ఘోరంగా ఓడిపోయారు.. మొత్తానికి విపక్షాలు అన్ని ఏకమై బీజేపీకి పెద్ద షాక్ ఇచ్చాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.