TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సీఎం రమేష్ దీక్షను గిన్నీస్ బుక్ లోకి ఎక్కించాలి..!

Published on: Wed Jul 4, 2018 2:23PM

ఏపీ బీజేపీ, టీడీపీ మీద రోజురోజుకి విమర్శల డోసు పెంచుతుంది.. తాజాగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ నేతలు అన్నింటిలోనూ అవినీతికి పాల్పడుతున్నారని, చివరికి మరుగుదొడ్ల నిర్మాణంలోనూ అవినీతి చేశారని మండిపడుతూనే.. మరోవైపు చంద్రబాబు చేసిన ఒక పనికి మెచ్చుకున్నారు.. ఏపీలో హోంగార్డుల కష్టాలు గుర్తించి వారి జీతాలు పెంచినందుకు సీఎం చంద్రబాబుకు, హోం మంత్రి చినరాజప్పకు కన్నా ధన్యవాదాలు తెలిపారు.. అలానే కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేత సీఎం రమేష్ చేసిన దీక్ష గురించి కన్నా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసారు.. షుగర్ వ్యాధిగ్రస్తులు ఒకట్రెండు రోజులే తినకుండా ఉండలేరని, అలాంటిది సీఎం రమేష్ పదకొండు రోజుల పాటు ఆమరణనిరాహార దీక్ష చేయడం సాధారణ విషయం కాదని, ఈ దీక్షను గిన్నిస్ బుక్ లోకి ఎక్కించాలని అన్నారు.. సీఎం రమేష్ వల్ల దీక్షలపై ప్రజల్లో ఉన్న నమ్మకం పోయిందని కన్నా విమర్శించారు.