వై.ఎస్ రుణం తీర్చుకున్నానంటున్న కిరణ్..!
Published on: Tue Oct 9, 2012 6:45PM
.jpg)
వై.ఎస్ రుణాన్ని తీర్చేశానంటూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పబ్లిగ్గా చెప్పారు. అంతేకాదు ప్రస్తుతం తమిళనాడు రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్న రోశయ్య రుణాన్నికూడా తీర్చేసుకున్నారట. గతంలో వీళ్లద్దరూ పడ్డ బకాయిల్ని తాను తీర్చాల్సొచ్చిందని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బహిరంగంగా వెల్లడించారు. ఈ మాటలు విన్నవాళ్లంతా ఆశ్చర్యపోయారు. కిరణ్ నోటి వెంట మరికొన్ని వివరాలు వెల్లడయ్యాకగానీ అసలు విషయం జనానికి అర్థం కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 2008నుంచీ ఫీ రీఇంబర్స్ మెంట్ పథకాన్ని అమలుచేస్తోంది. దీనికి సంబంధించి వై.ఎస్ హయాంలోగానీ, రోశయ్య హయాంలోగానీ నిధులు విడుదలకాలేదనీ, తాను వచ్చాక పాతబకాయిలన్నీ చెల్లించేశాననీ ముఖ్యమంత్రి చెప్పుకొచ్చారు. ఇప్పటివరకూ దాదాపు 8వేల ఐదొందలకోట్ల రూపాయల బకాయిల్ని తాను క్లియర్ చేసినట్టు ప్రకాశం జిల్లాలో ఏర్పాటుచేసిన ఇందిరమ్మ బాట కార్యక్రమంలో సీఎం చెప్పుకున్నారు.


