దాడికి సీఎం సారీ
Published on: Tue Jan 31, 2012 3:43PM
హైదరా
బాద్ : సీఎం క్యాంపు కార్యాలయం వద్ద జరిగిన సంఘటనపై దాడి వీరభద్రరావుకి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఫోన్ చేసి క్షమాపణలు చెప్పారు. శాసనమండలిలో ప్రతిపక్షనేత అయిన దాడి వీరభద్రరావు ఈరోజు ఉదయం సీఎం అపాయింట్‌మెంట్ తీసుకున్నారు. జూడాల సమస్యలపై వినతిపత్రం ఇచ్చేందకు వెళ్లారు. అయితే సీఎం కార్యాలయం వద్ద భద్రతాసిబ్బంది దాడి కారును లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహించిన దాడి వీరభద్ర సీఎంను కలవకుండానే తిరిగి వెళ్లిపోయారు. సీఎం వైఖరిపై ఆయన తీవ్ర ఆగ్రహం చేశారు. ఈ క్రమంలోనే సీఎం దాడికి ఫోన్ చేశారు.


