తెలంగాణ బిల్లుపై సంతకం చేసిన సీఎం కిరణ్
Published on: Fri Dec 13, 2013 5:30PM
.jpg)
తెలంగాణ ముసాయిదా బిల్లుపై సంతకం చేసి అసెంబ్లీ స్పీకర్ నాదేండ్ల మనోహర్‌కు, శాసనమండలి ఛైర్మన్ చక్రపాణికు పంపించామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ బిల్లుకు భాషాపరమైన సమస్యలు ఉన్నాయని, నిబంధనల ప్రకారం మూడు భాషల్లో ఉండాల్సిన బిల్లు ప్రతులు ఇంగ్లీష్‌లో ఉందని, తెలుగు, ఉర్దూలోకి అనువదించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ముసాయిదా బిల్లుపై చర్చ ఎప్పుడన్నది సోమవారం బిజినెస్ అడ్వజయిరీ కమిటీ (బీఏసీ)లో నిర్ణయం జరుగుతుందని సీఎం కిరణ్ తెలిపారు. బిల్లులోని ప్రతి క్లాజుపై ఓటింగ్ అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. గడువు సరిపోతుందా, లేదా అన్నది ఇప్పేడే చెప్పలేమని సీఎం పేర్కొన్నారు. 371 డి సవరణకు సభ్యుల్లో 2/3వ వంతు మెజారిటీ అవసరమని ముఖ్యమంత్రి చెప్పారు. బిల్లులో 371 హెచ్ ఉందని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.


