TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వయలార్ రవితో కిరణ్ భేటీ

Published on: Fri Aug 24, 2012 11:49AM

CM Kiran kumar reddy, vayalar ravi, congress seniors, post change, chair politics, botsa satyanarayana,  congress party, sonia gandhi, discussions, manmohan singh, prime minister

                                                                                                                                                                                              కాంగ్రెస్ సీనియర్ నేత వయలార్ రవితో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో భేటీ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై చర్చించారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రథాని మన్మోహన్  సింగ్ లతోకూడా ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఢిల్లీలోనే మకాంపెట్టి అధిష్ఠానంతో చర్చలు జరుపుతుండడం పలు ఊహాగానాలకు తావిస్తోంది. నాయకత్వం మార్పుపై నిర్ణయం తీసుకునేందుకే అధిష్ఠానం కిరణ్ కుమార్ రెడ్డిని ఢిల్లీకి పిలిపించిందన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం పాలనకు సంబంధించిన విషయాల్ని తెలుసుకునేందుకే సీఎంని ఢిల్లీకి పిలిపించామని చెబుతోంది. బొత్సకు పదవీగండం, ధర్మాన రాజీనామా విషయాలపైకూడా ఢిల్లీలో హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయ్.