ఢిల్లీకి వెళ్లనున్న సీఎం కిరణ్ కుమార్ రెడ్డి
Published on: Fri Nov 8, 2013 10:07AM
.jpg)
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సమావేశానికి హాజరు కమ్మని దిలీ నుండి పిలుపు రావడంతో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీ వెళ్ళనున్నారు. అధిష్టానాన్ని ధిక్కరిస్తూ రాష్ట్రవిభజనను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నకారణంగా, ఆయనను ఎప్పుడయినా ముఖ్యమంత్రి పదవి నుండి తప్పించవచ్చనే ఊహాగానాలు చెలరేగుతున్నతరుణంలో ఆయనకు డిల్లీ నుండి పిలుపురావడం, ఆయన నిన్నసాయంత్రం హైదరాబాద్ లో గవర్నర్ నరసింహన్ ను కలవడం చర్చనీయాంశమైంది. దాదాపు గంట సేపు సాగిన వారి వీరి భేటీలో ఇరువురు ఏమి చర్చించారనేది తెలియలేదు.
ఈరోజు సాయంత్రం లేదా రేపు ఉదయం డిల్లీలో జరుగనున్నసమన్వయ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు బొత్సా, డిప్యూటీ సీం రాజనరసింహ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్-చార్జ్ దిగ్విజయ్ సింగ్ తదితరులు పాల్గొని రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దడం, పార్టీ పరిస్థితి, శాసనసభలో తెలంగాణా బిల్లు ఆమోదం తదితర అంశాలను చర్చించవచ్చును.


