ఈవీఎంలు వద్దు...బ్యాలెట్ పేపర్లే కావాలి..
Published on: Tue Mar 14, 2017 6:10PM
ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఏం లకు బదులు బ్యాలెట్ పేపర్లు ఉపయోగించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ఆయన ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు చేపట్టాలని కేజ్రీవాల్ కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్లు తెలుస్తుంది. దీనిలో భాగంగానే పేపర్ బ్యాలెట్‌ను వాడే విధంగా ఎన్నికల కమీషన్‌కు లేఖ రాయాలని చీఫ్ సెక్రటరీకి సీఎం కేజ్రీవాల్ ఆదేశాలు జారీచేశారు. అయితే కేజ్రీవాల్ చేసిన అభ్యర్థనను రాష్ట్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. రాబోయే ఢిల్లీ మున్సిపల్ ఎన్నికల్లో ఈవీఎంలనే వాడనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ శ్రీవాత్సవ్ తెలిపారు.


