రేపటి నుండి కేజ్రీవాల్ సరి-బేసి నిబంధన అమలు..!
Published on: Thu Dec 31, 2015 11:49AM

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కాలుష్య నివారణకు ఓ వినూత్న పద్దతికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఈ పద్దతిని కొత్త సంవత్సరం సందర్బంగా రేపటి నుండి అమలు చేయాలని కేజ్రీవాల్ చూస్తున్నట్టు తెలుస్తోంది. రేపటి నుండి సరి-బేసి ట్రాఫిక్ నిబంధనలు అమలు అయ్యేలా.. ఒకరోజు సరిసంఖ్య ఒకరోజు బేసి సంఖ్య వాహనాలు తిరిగేలా అనుమతి ఇవ్వనున్నట్టు సమాచారం. దీనిలో భాగంగా ఈ రోజు రెండు గంటల పాటు ట్రయల్ రన్ ఏర్పాటు చేయనున్నారు. కాగా వీవీఐపీలు, వీఐపీలు, మహిళలు, టూ వీలర్ వాహనాలకు ఈ నిబంధనల నుండి మినహాయింపు ఉంటుందని తెలిపారు.


