రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్.. ఆలయ పునఃప్రారంభ ముహూర్తం ఖరారు!
Published on: Mon Oct 18, 2021 2:01PM
అదిగదిగో యాదాద్రి. శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్‌నిర్మాణ పనులు అత్యంత వేగంగా జరుగుతున్నాయి. ఆ పనులు దాదాపు కొలిక్కి వచ్చాయి. అతి త్వరలో యాదాద్రి ఆలయం పునఃప్రారంభించాలని సీఎం కేసీఆర్ పట్టుదలతో ఉన్నారు. అందుకే, పదే పదే ఆలయ పనులను స్వయంగా పరిశీలిస్తున్నారు.
తాజాగా, ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం యాదాద్రికి వెళ్లనున్నారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం పునర్నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. రేపటి పర్యటనలో ఆలయ పునఃప్రారంభ తేదీలను సీఎం కేసీఆర్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆలయ పునర్ ప్రారంభం సందర్భంగా నిర్వహించ తలపెట్టిన మహా సుదర్శన యాగం వివరాలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించనున్నట్టు సమాచారం.


