TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పీపీఈ కిట్ లేకుండానే కొవిడ్ రోగులతో మాట్లాడిన కేసీఆర్ 

Published on: Wed May 19, 2021 1:32PM

హైదరాబాద్ లోని  కొవిడ్ గాంధీ హాస్పిటల్ ను సందర్శించారు సీఎం కేసీఆర్. దాదాపు 30 నిమిషాల పాటు ఆయన గాంధీ హాస్పిటల్ లో ఉన్నారు. క‌రోనా రోగుల‌కు అందుతున్న సేవ‌ల‌ను ప‌రిశీలించారు. గాంధీ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డు ను విజిట్ చేశారు కేసీఆర్.  కొవిడ్ వార్డుల్లోకి పీపీఈ కిట్లు ధరించే వైద్యులు, సిబ్బంది వెళుతుంటారు. కాని సీఎం కేసీఆర్ మాత్రం కేవలం మాస్క్ మాత్రమే ధరించి కొవిడ్ ఎమర్జెన్సీ వార్డులోకి వెళ్లారు.  పీపీఈ కిట్ లేకుండానే ఎమర్జెన్సీ వార్డ్ లో  చికిత్స పొందుతున్న కోవిడ్ పేషంట్ల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడారు. 

క‌రోనా ఎమర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్న రోగుల‌ను సీఎం కేసీఆర్ ప‌రామ‌ర్శించారు. ఐసీయూ పేషంట్లతో మాట్లాడి వాళ్లకు ధైర్యం చెప్పారు. వాళ్లకు అందిస్తున్న చికిత్స గురించి ఆరా తీశారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో క‌రోనా రోగుల‌కు చికిత్స అందిస్తున్న డాక్ట‌ర్ల‌ను సీఎం కేసీఆర్ అభినందించారు.కొవిడ్ చికిత్స‌తో పాటు ఆక్సిజ‌న్‌, ఔష‌ధాల ల‌భ్య‌త‌ను ప‌రిశీలించి అధికారులతో చ‌ర్చించారు సీఎం కేసీఆర్. 

ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖను సీఎం కేసీఆర్‌ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ వెంట మంత్రి హ‌రీష్ రావు, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సోమేశ్ కుమార్, వైద్యారోగ్య శాఖ అధికారులు ఉన్నారు. సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో గాంధీ ఆస్ప‌త్రి వ‌ద్ద పోలీసులు ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేశారు. రోగుల స‌హాయ‌కుల‌ను బ‌య‌ట‌కు పంపించేశారు. గాంధీ ఆస్ప‌త్రి ప్రాంగ‌ణంలో ర‌సాయ‌నాల‌తో పిచికారీ చేశారు.