TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రోడ్డెక్కిన ముఖ్యమంత్రి.. యుద్ధం ఆపేదిలేదన్న కేసీఆర్

Published on: Thu Nov 18, 2021 10:42AM

తెలంగాణ ముఖ్యమంత్రి రోడ్డెక్కారు. రైతుల కోసమంటూ  ధర్నాకు దిగారు. ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ఆందోళన చేస్తుండటం ఇప్పుడు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. వరి ధాన్యం విషయంలో కొన్ని రోజులుగా కేంద్రంతో పోరాటం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం. అధికార పార్టీగా ఉండి కూడా ఇటీవలే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టింది. తాజాగా ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం వైఖరి స్పష్టం చేయాలంటూ అధికార టీఆర్‌ఎస్ పార్టీ  వద్ద మహాధర్నాకు దిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. 

మహాదర్నాలో మోడీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు కేసీఆర్. కేంద్రం తన విధానాలను మార్చుకోవాలన్న డిమాండ్‌తో ఈ యుద్ధాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఈ యుద్ధం ఒక్కరోజుతో ఆగేది కాదు.. ఇది ఆరంభం మాత్రమేనని హెచ్చరించారు. వరి కొనుగోలు విషయంలో కేంద్రం ద్వంద్వ ప్రమాణాలను నిరసిస్తూ మహా ధర్నాకు దిగినట్టు కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. 

కేంద్ర సర్కార్ తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు కేసీఆర్. ఢిల్లీలో రైతులు చేస్తున్న పోరాటాన్ని స్పూర్తిగా తీసుకొని రైతులు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్రం వైఖరి రైతులకు నష్టం చేకూర్చేలా ఉందని విమర్శించారు. కేంద్రం దిగివచ్చి రైతులకు న్యాయం చేసే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.