TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తెలంగాణ హైకోర్టు సీజే ప్రమాణ స్వీకారం.. హాజరైన సీఎం కేసీఆర్

Published on: Tue Jun 28, 2022 10:37AM

తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ మంగళవారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై ఆయన చేత  సీజేగా ప్రమాణ స్వీకారం చేశారు. సీజే ప్రమాణ స్వీకారోత్సవంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. గత కొంత కాలంగా  సీఎం కేసీఆర్, రాష్ట్ర గవర్నర్ తమిళిసై మధ్య సంబంధాలు అంతంత మాత్రంగా ఉన్న సంగతి తెలిసిందే.

రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య దూరం పెరిగిందనడానికి పలు సంఘటనలు సాక్షీ భూతంగా నిలిచాయి. గత కొంత కాలంగా కేసీఆర్ రాజ్ భవన్ కు వెళ్లిన దాఖలాలు లేవు. అలాగే గవర్నర్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో పర్యటించిన సందర్శంగా ప్రొటోకాల్ ప్రకారం ఆమె పర్యటనలలో రాష్ట్ర మంత్రులు పాల్గొన లేదు.

ఈ విషయమై గవర్నర్ బహిరంగంగా తన అసంతృప్తిని వెళ్లగక్కిన సందర్భాలూ ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ జాతరలో కానీ, యాదాద్రి సందర్శన సమయంలో కానీ గవర్నర్ కు ప్రొటో కాల్ ప్రకారం మర్యాదలు జరగలేదన్న ఆరోపణలు ఉన్నాయి.

కాగా చాలా కాలం తరువాత సీజే ఉజ్జల్ భుయాన్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి రాజ్‌భవన్‌కు చేరుకున్న సీఎం కేసీఆర్  సిబ్బందికి అభివాదం చేస్తూ రాజ్‌భవన్‌లోకి ఎంటర్ అయ్యారు. సీఎంతో పాటు.. మంత్రులు, ఉన్నతాధికారులు   ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.