TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కేసీఆర్ డేంజర్ డెసిషన్...విమర్శిస్తే అంతే సంగతి...

Published on: Sat Jan 27, 2018 2:40PM

 

ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి పాలనపై నియంత పాలన అన్నముద్ర పడింది. ఆయన పాలన వల్ల ఇప్పటికే చాలామాంది కేసీఆర్ కు వ్యతిరేకమయ్యారు..వ్యతిరేకమవుతున్నారు. అంతేకాదు ఉద్యమ సమయంలో కేసీఆర్ తో కలిసి కీలక పాత్ర పోషించిన కోదండరాం కూడా ఇప్పుడు ఆయనకు వ్యతిరేకమయ్యారు. అంతేకాదు ఇప్పుడు ఏకంగా ఓ కొత్తపార్టీనే పెట్టేందుకు సిద్దమయ్యారు. దీనికి కారణం కేసీఆర్ గారి చేస్తున్న కొన్ని పనులు నచ్చకపోవడమే. అయితే ఇప్పుడు మరో నిర్ణయం తీసుకొని పెద్ద దుమారమే రేపుతున్నారు కేసీఆర్.

 

రాజకీయాల్లో ఒకపార్టీపై మరొకపార్టీ విమర్సలు గుప్పించుకోవడం కామన్ థింగ్. రాజకీయాలే కాదు సామాన్య ప్రజలు కూడా కాస్త కోపం వచ్చిందంటే... తిట్టుకుంటారు... దూషించుకుంటారు. మరి అలాంటిది.. విమర్శలు చేయోద్దు అంటే కుదురుతుందా. అలానే ఉంది ఇప్పుడు కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చూస్తుంటే.. ఎదుటివారిని దూషించినా, అభ్యంతరకరంగా మాట్లాడినా, పోలీసులు ఎవరి అనుమతి లేకుండానే కేసు పెట్ట్టుకోవచ్చట. ఇప్పటివరకు కోర్టు అనుమతితోనే కేసు పెట్టాలి. అయితే ఇప్పుడు ఆ అవసరం లేదు. ప్రభుత్వం అవసరం అనుకుంటే అనుమతి తీసుకోవచ్చు, తీసుకోకుండా కూడా ముందుకు పోవొచ్చట. దీనికి సంబందించిన పైల్ పై ఆయన ఈరోజే సంతకం చేశారు.

 

దీంతో కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై పెద్ద చర్చే జరుగుతుంది. అంతేకాదు కేసీఆర్ ఈ నిర్ణయం ప్రతిపక్షాలను ఉద్దేశించే తీసుకున్నట్టు ఉన్నారు అని మాట్లాడుకునే వాళ్లు కూడా ఉన్నారు. ఇదేదో.. ప్రతిపక్షాన్ని నియంత్రించడానికి తెచ్చినట్టుగా ఉంది అని రాజకీయాల్లో చర్చకు వస్తుంది. అంతేకాదు... గతంలో అనేక మారులు ప్రభుత్వంపై రుజువులు లేకుండా విమర్శలు చేస్తే కేసులు పెడతాం అని హెచ్చరించారు...ఇప్పుడు ఆయన చెప్పినట్టే చేశారు అని ముచ్చటించుకుంటున్నారు. ఇక కేసీఆర్ తీసుకున్న నిర్ణయంపై బీజేపీ నేత కిషన్ రెడ్డి మాట్లాడుతూ... ఈ రూల్ ప్రకారం కేసులు పెట్టాల్సివస్తే ముందు పెట్టాల్సిందే కేసీఆర్ మీదేఅని ఆయన వాడినటువంటి అభ్యంతరకర బాషా ఇది వరకు ఎప్పుడు తెలుగు రాజకీయాలలో ఎవరు వాడలేదని అని కామెంట్ విసిరారు. మరి ముఖ్యమంత్రి గారిపై కేసు పెట్టే ధైర్యం ఉంటుందా....? మొత్తానికి కేసీఆర్ మరో ప్రమాదకరమైన నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం ఆయనపై ఎలాంటి ప్రభావం చూపుతుంది... ఈ నిర్ణయం వల్ల ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతాయి చూద్దాం...