20 వేల పోస్టులకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగులకు తీపి కబురు చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న 20 వేల ఉద్యోగుల భర్తీకి సీఎం అనుమతినిచ్చారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దస్త్రానికి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు. వీలైనంత త్వరగా ఉద్యోగాల నియామకాలు చేపట్టాలని టీఎస్‌‌పీఎస్‌సీ ఛైర్మన్ ఘంటా చక్రపాణి ముఖ్యమంత్రి సూచించారు. 

 

ఖాళీల వివరాలు:

* 84 కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయాల్లో 1428 ఖాళీలు
* కొత్త జిల్లా కేంద్రాల్లోని 29 పట్టణ గురుకులాల్లో 377 ఖాళీలు
* రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 8792 ఉపాధ్యాయ పోస్టులు